మోకిల సిఐని కలిసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు నాయక్
23-05-2026 08:45 PM
శంకర్ పల్లి.(విజయక్రాంతి): ఇటీవల నూతనంగా మోకిల సీఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డిని శనివారం శంకర్ పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... శాంతి భద్రత పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు.






