23 May, 2026 | 9:47 PM

బ్రహ్మశ్రీ డాక్టర్ బరిబద్దల హరిప్రసాద్ ఎంపిక

23-05-2026 08:49 PM

కరీంనగర్ క్రేమ్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారి జి సి ఎస్  సౌజన్యంతో, వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు వేడుకల్లో ప్రముఖ జ్యోతిర్ వాస్తు నిపుణులు, అంతర్జాతీయ సర్టిఫైడ్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ బరిబద్దలు హరిప్రసాద్ 2026 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రం నుండి "బెస్ట్ ఆస్ట్రాలజర్ 2026" అవార్డుకు ఎంపికయ్యారు. జ్యోతిష్య శాస్త్రంలో విశేష అనుభవం కలిగిన హరిప్రసాద్  ముఖ్యంగా దశా గణన, జాతక విశ్లేషణ, జ్యోతిర్ వాస్తు రంగాల్లో తన ప్రత్యేక ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

వేలాది మందికి ఖచ్చితమైన జ్యోతిష్య మార్గదర్శకత్వం అందిస్తూ ఆధ్యాత్మిక విశ్వాసాన్ని పెంపొందిస్తున్న ఆయన సేవలకు గుర్తింపుగానే ఈ అరుదైన గౌరవం వరించింది. అంతర్జాతీయ మదర్స్ డే మరియు గౌతమ బుద్ధ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక రవీంద్ర భారతిలో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు, సామాజికవేత్తలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలబెట్టిన బ్రహ్మశ్రీ డాక్టర్ బరిబద్దల హరిప్రసాద్ గారికి పలువురు ప్రముఖులు, శిష్యులు, అభిమానులు మన అభినందనలు తెలియజేస్తున్నారు.