23 May, 2026 | 9:48 PM

విద్యావంతుడికి ఇవ్వడం అభినందనీయం

23-05-2026 08:37 PM

బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొమ్మన బోయిన సువిన్ యాదవ్ విద్యావంతుడు యువకుడు కావడం అభినందనీయమని బోయినపల్లి సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకట రామారావు అన్నారు. శనివారం సాయంత్రం ఆయనను కుదురుపాకలో పూలమాలలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ బాలగోని వెంకటేశ్వర్లు, నాయకులు బాలమల్లు వార్డు సభ్యులు పాల్గొన్నారు.