23 May, 2026 | 8:58 PM

6వ రోజుకు చేరిన వీవోఏల రిలేదీక్షలు

23-05-2026 08:11 PM

బూర్గంపాడు,(విజయ క్రాంతి): జిల్లాలో వీవోఏల పరిస్థితి దయనీయంగా మారిందని... జీతం జానెడు... పని భారం బారెడు అన్న చందంగా తమ బతుకులు ఉన్నాయంటూ వీవోఏలు తెలంగాణ ఐకేపీ వీవోఏల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సెర్ప్ ఆధ్వర్యంలో బూర్గంపాడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట చేపట్టిన రిలేదీక్షలు శనివారం 6వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వీవోఏలు మాట్లాడుతూ ఎండను సైతం లెక్కచేయకుండా రిలేదీక్షలు చేస్తున్నా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలేదని వాపోయారు. వీవోఏలకు రూ.26వేల గౌరవవేతనం, పీఆర్‌సీ అమలుచేయాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాదబీమా రూ.20లక్షలు చెల్లించాలని, ఆరోగ్యబీమా రూ.10లక్షలు కల్పించాలని, అర్హులైన వీవోఏలను సీసీలుగా పదోన్నతి కల్పించాలని, గుర్తింపుకార్డులు, ట్యాబ్‌లతో పాటు నెట్‌సౌకర్యం కల్పించాలని, జీవో 58ని సవరించాలని తదితర డిమాండ్లను పరిష్కరించి వీవోఏలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.