బాధ్యతలు చేపట్టిన బోడ స్వామికి ఘన సన్మానం
నల్లగొండ,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్‌గా రెండోసారి నియమితులైన బోడ స్వామి నిపలువురు ముఖ్య నాయకులు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. శనివారం ఆయన రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రికి శాలువా కప్పి, బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య లు బోడ స్వామిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.
అలాగే హైదరాబాద్‌లోని గాంధీ భవన్ లో నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ను కలిసి ఆశీస్సులు పొందారు. అనంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ మందుల సూర్య కిరణ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పగా, సూర్యకిరణ్ కూడా బోడ స్వామికి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. తదుపరి హైదరాబాద్‌లోని నిజాం క్లబ్ ఆవరణంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డా. కావాంపల్లి సత్యనారాయణ ను కలిసి శాలువా కప్పి, బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో పెరికే హరిప్రసాద్, కుడుతల నాగరాజు, వంగోటి సైదులు, చలిచీమల యాదయ్య, గాదపాక అంజయ్య, మొలుగూరి సునీల్, పెరికే అంజయ్య తదితరులు పాల్గొన్నారు.






