7 May, 2026 | 6:24 PM

వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

07-05-2026 05:29 PM

మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

దేవరకొండ,(విజయక్రాంతి): వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. అయ్యిందని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్  ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కొండమల్లెపల్లి మండలం పెండిపాకుల గ్రామపంచాయతీ పరిధిలోని బాబులా తండా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తరుగు పేరుతో 2 కిలోలు, మిల్లర్లు మరో 3 కిలోలు కోత వేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ హయాంలో వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులు పర్యటించి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారని, గన్నీ బ్యాగుల సరఫరా కూడా సక్రమంగా లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.