calender_icon.png 17 February, 2026 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిస్వార్థంగా.. నిర్మల్ అభివృద్ధిని సాధిస్తాం

17-02-2026 01:21:09 AM

మున్సిపల్ చైర్‌పర్సన్ కావ్య, వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి 

నిర్మల్, ఫిబ్రవరి ౧6 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రాజకీయ చైతన్యం ఉన్న నిర్మల్ మున్సిపాలిటీలో తమపై విశ్వాసం ఉంచి చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నుకున్న ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్ధంగా సేవ చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య వైస్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు.

ఎన్నికైన వీరికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీ ఆర్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమత్ అలీ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి అబ్దుల్ ఆది ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. నిర్మల్ మున్సిపాలిటీలో అప్పల కుటుంబానికి ఇప్పటివరకు మున్సిపల్ పీఠం నాలుగు సార్లు దక్కటం వెనుక నిర్మల్ ప్రజల రుణం ఎంత ఇచ్చిన తీర్చుకోలేమని స్పష్టం చేశారు. కాంగ్రె స్ పార్టీ గెలుపుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మల్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామని అవినీతి అవినీతి రహిత పాలన అందిస్తామని కోతులను తరిమికొడతామని తెలిపారు. 42 వార్డులు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్య లు తీసుకుంటామన్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కడం భార్యాభర్తలు ఇద్దరికీ ఒకేసారి పదవులు రావడం నిర్మల్ ప్రజల ఆశీర్వాదమేనని తెలిపారు. ప్రజలకు ఏ అవసరమొచ్చినా తాము ముం దుంటామని భరోసా ఇచ్చారు అనంతరం పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు జరిపారు. కొత్తగా ఎన్నికైన చైర్పర్సన్ వైస్ చైర్మన్ పాలకవర్గ సభ్యులను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున సన్మానం చేశారు.