8 May, 2026 | 1:32 AM

కామారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ స్థానాల్లో కాంగ్రెస్ హవా

08-05-2026 12:30 AM
  1. మూడు స్థానాలు కాంగ్రెస్ కైవసం 
  2. ఒకటి బీఆర్‌ఎస్ సొంతo
  3. కాంగ్రెస్ బీఆర్‌ఎస్ మిలాఖత్
  4. బీజేపీ కౌన్సిలర్ ల ఆరోపణ 

కామారెడ్డి, మే 7 (విజయ క్రాంతి): కామారెడ్డి మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలకు చెందిన వారు కో ఆప్షన్ కోసం నామినేషన్లు దాఖలు చేశారు. ఎవరికి వారు ఓట్లు వేసుకుంటే కాంగ్రెస్కు రెండు,  బిఆర్‌ఎస్ ఓకటి, బిజెపికి ఒక ఆప్షన్ స్థానాలు దక్కేవి. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ లోపాయి గారి ఒప్పందo వల్ల కాంగ్రెస్కు మూడు కో ఆప్షన్ స్థానాలు దక్కగా, ఒక స్థానం బిఆర్‌ఎస్ దక్కించుకుంది. బిజెపికి ఒక స్థానం కూడా దక్కలేదు. కాంగ్రెస్ బి బిఆర్‌ఎస్ ఒప్పందాల వల్లే కామారెడ్డి మున్సిపల్ లో కాంగ్రెస్ మూడు కోఆప్షన్స్ స్థానాలను, టిఆర్‌ఎస్ ఒక కో ఆప్షన్ స్థానాన్ని దక్కించు కుందని పట్టణ బిజెపి అధ్యక్షుడు, కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్ ఆరోపించారు.

ఎట్టకేలకు కామారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.  మొత్తం నాలుగు కో-ఆప్షన్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని బీఆర్‌ఎస్కు కేటాయించగా, మిగిలిన మూడు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులను గురువారం కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. 

ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులు వీరే 

కామారెడ్డి మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు గోనే సునీత శ్రీనివాస్, ఆస్మా ముబషిర్,అలీ బిన్ అబ్దుల్లా, ఎన్నిక కాగా పొత్తులో భాగంగా బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కుంభాల రవి యాదవ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  హాజరై నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ కోఆప్షన్ సభ్యులను  అభినందించారు అభినందించారు. పూలమాలలు, శాలువాలతో వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. డిసిసి మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు,  పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేణి సందీప్ కుమార్, గ్రంథాలయ సమస్త జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పండ్ల రాజు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్, కాంగ్రెస్ నాయకులు గంప ప్రసాద్, పాత దివ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన విభాగ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.