కబ్జా కోరల నుంచి చెరువును కాపాడండి
కేసముద్రం, మే 7 (విజయక్రాంతి): గ్రామస్తులంద రికీ తాగునీరు, తాగునీరు అందిస్తూ గ్రామస్తులందరి ఉమ్మడి ఆస్తిగా ఉండాల్సిన చెరువు ను ఆక్రమించి వ్యవసాయం చేస్తూ రోజురోజుకు చెరువును కబ్జా చేస్తున్నారని వెంటనే అధికారులు స్పం దించి చెరువులో అక్రమ క బ్జాలను తొలగించాలని కోరుతూ ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామస్తులు తహసిల్దార్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు మాట్లాడుతూ గ్రామ ఉర చెరువు ను కొందరు ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారని, దీనివల్ల చెరువు విస్తీర్ణం తగ్గిపోయి, నీటి నిలువ సామర్థ్యం రోజు రోజుకు తగ్గుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య, ఉప సర్పంచ్ తుమ్మనపల్లి సతీష్, వార్డు మెంబర్లు భైరు వెంకటేశ్వర్లు, నిడిగంటి చంద్రమౌళి, నాయకులు భైరు శ్రీనివాస్, గుండాల ధర్మయ్య, పోలోజు రాజు, చెడుపాక వెంకన్న పాల్గొన్నారు.






