11 May, 2026 | 4:02 AM

కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలు: రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

11-05-2026 02:38 AM

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు రెండు తోడు దొంగలని, ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు చిప్ప చేతికి ఇచ్చాయని రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 1000 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు కేవలం తెలంగాణకే వేల కోట్లు మోదీ ఇచ్చారని స్పష్టం చేశా రు. కాంగ్రెస్ అంటే.. కరప్షన్ అని, మొసలి కన్నీరు కార్చే వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, మహిళలకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. బెంగాల్ ఎన్నికల్లో మహిళలు అంతా కలిసి అక్కడి పార్టీలను ఓడించారని, రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి దేశంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. సోమ్‌నాథ్ ఆల య నిర్మాణాన్ని నెహ్రూ అడ్డుకున్నారని, ఇప్పుడు  కాంగ్రెస్ అదే పని చేస్తోందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. మోదీ వచ్చాక ఆలయా న్ని పునర్నిర్మాణం చేపట్టారని తెలిపారు.