ప్రత్యేక రైలులో మోడీ సభకు తరలి వెళ్లిన బీజేపీ శ్రేణులు
మహబూబాబాద్, మే 10 (విజయక్రాంతి): రాష్ట్ర రాజధాని పరేడ్ గ్రౌండ్లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనున్న బహిరంగ సభకు కేసముద్రం ప్రాంతం నుండి ప్రత్యేక రైలులో భారతీయ జనతా పార్టీ నేతలు తరలి వెళ్లారు. విజయవాడ నుండి సికింద్రాబాద్ వరకు ఆదివారం ప్రవేశపెట్టిన ప్రత్యేక రైలులో వివిధ ప్రాంతాల నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు , నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మోడీ సభకు రైలులో వెళ్లే కార్యకర్తలకు, నాయకులకు భోజన వసతి కూడా కల్పించారు.
మహబూబాబాద్ జిల్లా పరిధిలోని డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం రైల్వే స్టేషన్ల నుండి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు పొదిల నరసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి దారా హిందూ భారతి, మండలాధ్యక్షుడు ఉప్పునూతల రమేష్, మున్సిపల్ టౌన్ కన్వీనర్ నాగేశ్వర చారి, మండల ఉపాధ్యక్షురాలు నాగనబోయిన చంద్రకళ, బచ్చు లక్ష్మీనారాయణ, లెంకలపల్లి శ్రీనివాస్, బానోత్ రాము నాయక్, గంధసిరి యాకాంబరం, గుజ్జురి వీరభద్రా చారి తదితరులు ఉన్నారు.






