రోడ్డెక్కిన ధాన్యం రైతులు
08-05-2026 11:58 AM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ధాన్యం కొనుగోలలో జాప్యంపై రోడ్డెక్కారు. మండలంలోని లోకేశ్వరం రాజుర బాగా పూర్ మన్మధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులు అర్లీ ఎక్స్ రోడ్ వద్ద బైసా నిర్మల్ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆందోళన చేయడంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న తహసిల్దార్ సూర్యారావు ఎస్సై గణేష్ అక్కడికి చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే కొనుగోలు పూర్తి చేస్తామని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు ఉన్నారు






