2 July, 2026 | 2:41 AM

నిష్పక్షపాతంగా విచారణ జరపండి

02-07-2026 01:01 AM

అంకం రాహుల్ మృతి కేసులో డీజీపీకి బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం నాయకుడు చిరంజీవులు వినతి

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): అంకం రాహుల్ అనుమానాస్పద మృతి కేసులో నిష్పక్షపాత విచారణ జరపాలని కోరుతూ బుధవారం డీజీపీ సీవీ ఆనంద్‌ను రాహుల్ తల్లిదండ్రులు అంకం రాజేశ్వర్, అంకం వనిత, బీసీ రాజ్యాధికార సమితి మహిళా బృందం, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ నాయకులు చిరంజీవులు (రిటైర్ట్ ఐఏఎస్), వారి టీమ్ మెంబర్స్ చెన్న శ్రీకాంత్, కొం డల్ గౌడ్, లింగేష్ యాదవ్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

రాహుల్ మృతికి సంబంధించిన పరిస్థితులను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. బండరాయి కట్టుకుని మృతి చెందడం సహజ మరణం కాదని, అనేక అనుమానాలకు తావిస్తున్నప్పటికీ ఇప్పటివరకు అనుమానితులను విచారించకపోవడం, సున్నితమైన ఈ కేసులో తగిన వేగంతో దర్యాప్తు జరగకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వినతిని శ్రద్ధగా విన్న డీజీపీ ఆనంద్ ఈ కేసును అత్యంత సున్నితంగా పరిగణించి, నిష్పక్షపాతంగా, వేగవంతంగా విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశిం చారు.

నిర్లక్ష్యాన్ని సహించబోమని తెలిపారు. న్యా యం, ధర్మం పట్ల ఆయన వ్యక్తం చేసిన నిబద్ధత బాధిత కుటుంబానికి, సమాజానికి కొత్త ఆశను కలిగించింది. ఈ సందర్భంగా బాధిత తల్లిదండ్రులు.. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్, బీసీ రాజ్యా ధికార సమితి తరఫున డీజీపీ ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రత్యేక చొరవ తీసుకుని బాధిత కుటుంబానికి అండగా నిలిచిన చిరంజీవులుకు, దాసు సురేష్‌కు బీసీ రాజ్యాధికార సమితి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.