19 June, 2026 | 6:26 PM

పోచమ్మ బోనాల వేడుకల్లో ఏనుగు మనోహర్ రెడ్డి

19-06-2026 05:09 PM

వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా మహాలక్ష్మీ వీధిలోని పెద్దమ్మ–దుర్గమ్మ తల్లి ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, పట్టణం మరింత అభివృద్ధి చెందాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వాసాల లావణ్య–శ్రీనివాస్, పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బైరి సతీష్, మాజీ కౌన్సిలర్లు మారం కుమార్, కందుల క్రాంతి, మాజీ ఎంపీటీసీ ఐలవేని రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.