19 June, 2026 | 6:26 PM

కాంగ్రెస్ పాలన ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్

19-06-2026 05:07 PM

కాంగ్రెస్, బీజేపీని హైదరాబాద్ ప్రజలు నమ్మలేదు

కాంగ్రెస్ సినిమాకు ఇంటర్వెల్ అయిపోయింది

హైదరాబాద్: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మల్కాజ్‌గిరి నియోజకవర్గ(Malkajgiri constituency) బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పార్టీ సభ్యత్వ నమోదు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision - SIR) పై పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్, బీజేపీని నమ్మలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ సినిమాకు ఇంటర్వెల్ అయిపోయిందని విమర్శించారు.

కాంగ్రెస్ పాలన ఫస్ట్ హాప్ అట్టర్ ప్లాఫ్ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పాలనను తిట్టుకోనివాళ్లు లేరని పేర్కొన్నారు. తులం బంగారం, రైతులకు రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని గ్యారంటీ కార్డు ఇచ్చారు, కానీ వంద రోజులు కాదు 900 రోజులు అయిపోయింది.. హామీలు నెరవేరాయా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో రెప్పపాటు కూడా కరెంట్ పోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. 61 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేదలకు ఇచ్చామని కేటీఆర్ స్పష్టం చేశారు.