19 June, 2026 | 6:24 PM

బాలిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి ఎంపీ ఎమ్మెల్యేలు

19-06-2026 04:53 PM

బోథ్,(విజయక్రాంతి): బాలికల విద్య అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఎన్పీజీ నగేష్ బోత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో 38.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలన్న దృక్పథంతో అదనపు గదుల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. బాలికలు చదువు పట్ల ఆసక్తి చూపించడంతో విద్యార్థినుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు వారి అవసరాలకు అనుగుణంగా అదనపు గదులను నిర్మించాల్సిన అవసరం ఏర్పడుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్యతో పాటు పలువురు నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థినులు పాల్గొన్నారు