5 August, 2026 | 1:23 AM

కేసీఆర్ కుటుంబం వల్లే సింగరేణికి నష్టం

05-08-2026 12:09 AM
  1. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రూ.54 వేల కోట్ల బకాయిలు పెట్టాయి
  2. ప్రధాని మోదీ సహకారంతోనే సింగరేణికి మూడో బ్లాక్
  3. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): తెలంగాణ అభివృద్ధికి నరేంద్రమోదీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని, ఇందులో భాగంగానే తాజాగా సింగరేణికి వరుసగా మూడో కోల్ బ్లాక్ పీకేవోసీ డిప్‌సైడ్ దక్కిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సింగరేణికి నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా బకాయిలు పడిందని, కేసీఆర్ కుటుంబంతో సింగరేణి సంస్థకు ఎంతో నష్టం వాటిల్లిందని ఆయన విమర్శించారు.

కేసీఆర్, రేవంత్ రెడ్డి పుణ్యమా అని సింగరేణికి రూ.54 వేల కోట్లు బకాయిలు పేరుకు పోయాయని తెలిపారు. మంగళవారం ఢిల్లీ లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తను బొగ్గు శాఖ మంత్రి అయినప్పటి నుం చి రాష్ట్రప్రభుత్వంతో చర్చిస్తూ.. సింగరేణికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నానని చెప్పారు. వేలంలో పాల్గొనడం ద్వారా వీలైనన్ని ఎక్కువ బ్లాక్స్‌ను పొందేలా ప్రోత్సహిస్తున్నానని, దీంట్లో భా గంగా.. పీకేఓసీ-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కిందన్నారు.

అనేక కంపెనీలు వేలంలో పాల్గొనడానికి ముందుకు వచ్చినా సింగరేణి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలని కోరినట్లు తెలిపారు. తాజా కోల్ బ్లాక్ కేటాయింపుతో సింగరేణికి కొత్త ఆశలు చిగురించాయని, సింగరేణిని గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దోచుకునేందుకు ప్రయ త్నించాయని విమర్శించారు. కేసీఆర్, రేవం త్ పుణ్యమా అని సింగరేణి కార్మికులకు సంబంధించిన రూ.54 వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయన్నారు. 

బకాయిలు ఎందుకివ్వట్లేదు..

సింగరేణికి బకాయిలు ఎందుకు ఇవ్వట్లేదు? సింగరేణి తెలంగాణలో లేదా? సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజలు కాదా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ‘కిషన్ రెడ్డి సింగరేణికి అన్యాయం చేశారంటూ కేసీఆర్ కొడుకు మాట్లాడుతున్నాడు. సింగరేణికి అన్యాయం చేసిందెవరో చర్చకు సిద్ధమా? మీ కు టుంబం పుణ్యమా అని సంస్థ దివాళా తీసే ప్రమాదంలో ఉంది. నేను బొగ్గు శాఖ మంత్రి అయ్యాకే సింగరేణికి న్యాయం జరుగుతోంది. ఈ సంస్థకు ఉన్న రూ. 54వేల కోట్ల బకాయిలు ఇచ్చేలా రాష్ట్ర బీజేపీ తరఫున ఒత్తిడి చేస్తాం’ అని ఆయన తెలిపారు. 

కేసుపెట్టిన డీసీపీపై వేధింపులు

ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని, అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేస్తూ పోస్టులు చేశారని, మోదీ తల్లిపై కూడా నీచంగా, అమానవీయంగా పోస్టులు పెట్టారని మండిపడ్డారు. దీనిపై బీజేపీ నేత సాయి కిరణ్.. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్నారు.

ఐటీ చట్టం ప్రకారం జూలై 29 న సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు చేశారని, దర్యాప్తులో భా గంగా.. పోస్టులు చేసినవారితోపాటుగా మెటా ఇండియా హెడ్‌కు కూడా నోటీసులు ఇచ్చారన్నారు. అయితే మెటా సంస్థకు నోటీసులు ఇచ్చిన డీసీపీ అరవింద్‌బాబుని రాష్ట్ర ప్రభు త్వం వేధింపులకు గురిచేస్తోందన్నారు.

మెటా కంపెనీపై ఎలా కేసు పెడతారంటూ.. ఢిల్లీ నుంచి రాహుల్‌గాంధీ.. తెలంగాణ  కాంగ్రెస్ చీఫ్, తెలంగాణ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో డీసీపీని బదిలీ చేశారని చెబుతున్నారన్నారు. రెండేళ్లలో 44 సార్లు అధికారు ల బదిలీలతోఆందోళన నెలకొందని, డీసీపీని బదిలీ చేసి,  మిగిలిన అధికారులను కూడా బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. 

గతంలో ఫామ్‌హౌస్ ఫైల్స్‌తో..

‘ఫాంహౌస్ ఫైల్స్’ పేరుతో గతంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతలను, మీడియా వ్యక్తులను, సినిమా నటులను, కుటుంబసభ్యులపై కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి అధికార దుర్వినియోగం చేసింది అందరూ చూశారని, తన ఫోన్‌ను ట్యాప్ చేశారని కేసీఆర్ కూతురే చెప్పారన్నారు. కాంగ్రెస్ మద్దతుతో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభు త్వం.. అక్కడి ప్రతిపక్ష నేత ఏదో చేశాడని ఆయన్ను అరెస్టు చేశారని, మరి వారికి అ క్కడో న్యాయం.. ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ మరో న్యాయమా? అని ప్రశ్నించారు.

2020లో 5,024 సైబర్ క్రైం కేసులు నమోదైతే.. 2024లో 27,230 కేసులు నమోదయ్యాయన్నారు. ఒకప్పుడు రాజకీయాలు హూందాగా ఉండేవని, ఇప్పుడు  మారిపోయాయని,  తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోందన్నారు.