14 March, 2026 | 4:14 PM

మహిళా మృతి పై ముత్తారంలో ఆందోళన

14-03-2026 01:26 PM

మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ 

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం గ్రామానికి చెందిన ఎరుకల కులానికి చెందిన సారమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన కొంతమంది పెద్ద మనుషులు వేధించడంతోనే సారమ్మ మృతి చెందిందని, సారమును వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ముత్తారం మండల కేంద్రంలోని కాసర్ల గడ్డ చౌరస్తా వద్ద ఎరుకల హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు, మంథని కి చెందిన ప్రజా సంఘాల నాయకులు ఎస్సీ, ఎస్టీ సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కాసర్ల గడ్డ బస్టాండ్ వద్ద సారమ్మ ఫోటోతో బైఠాయించి సారమ్మ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఎరుకల కుల సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్టి కులానికి చెందిన మహిళ ను గ్రామానికి చెందిన కొంత మంది పెద్ద మనుషులు భూమి వివాదంలో ఇష్టం వచ్చినట్టు నానా బూతులు తిట్టినందుకు మనస్థాపానికి గురై మహిళ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరుద్ధరణ కాకుండా పోలీసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గోదావరిఖని ఏసిపి, మంథని సిఐ ఆధ్వర్యంలో మంథని, రామగిరి, ముత్తారం, ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుల్ సిబ్బంది పెద్ద ఎత్తున బంధవస్తు నిర్వహించారు.