బీఏ, బీబీఏ , బీకాం, బీఎస్సీ పరీక్ష రుసుము గడువు పెంపు
ముకరంపుర, మార్చి 14(విజయ క్రాంతి):శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ కోర్సులలో పరీక్షల గడువు తేదీలను, పరీక్షల ప్రణాళికలను విడుదల చేసింది. బి.ఏ, బి.బి.ఏ, బి.కాం., బి.ఎస్సి., రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు పెంచారు. పరీక్షలు ఏప్రిల్ లో జరుగుతాయని పరీక్ష రుసుము 18-03-2026 లోపు కట్టవలసిందిగా, 300 రూపాయల అపరాధ రుసుముతో 24-03-2026 వరకు అనుమతించినట్టు తెలిపారు.
అలాగే ఎం.ఎడ్ (మాస్టర్ అఫ్ ఎడ్యుకేషన్) మూడవ సెమిస్టర్ పరీక్షలు 23 -03 -20 26 నుండి 30-03-2026 వరకు జరగనున్నట్టు, ఎల్. ఎల్. ఎం. (పి.జి)న్యాయ కోర్సులో మూడవ సెమిస్టర్ పరీక్షలు 18 నుండి 24 వరకు జరగనున్నట్టు, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ(బి.ఫార్మసీ) మూడవ ఐదవ సెమిస్టర్ పరీక్షల ప్రణాళికను విడుదల చేయగా 23-03-2026 నుండి 02-04-2026 వరకు జరుగుతాయని , ఇతర వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైటు లేదా ఆయా కళాశాలలో సంప్రదించవలసిందిగా పరీక్షలనియంత్రణ అధికారి డా.డి.సురేష్ కుమార్ తెలిపారు.




