బీఆర్ఎస్ వైపే ప్రజల మొగ్గు
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు. శనివారం ఆసిఫాబాద్‌లోని ఆమె నివాసంలో వాంకిడి మండలం పాటగూడా గ్రామ సర్పంచ్ సోయం శ్రీదేవి–సంజీవ్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజల సంక్షేమం కేసిఆర్ తోనే సాధ్యం అనే నమ్మకంతో ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీ ఇచ్చి గద్దెనిక్కిందని ఆరోపించారు. నన్ను రోజుల్లో ప్రజలే ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్, వాంకిడి, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అజయ్, రవీందర్, అఖిల గాండ్ల తేలీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సందీప్, వాంకిడి మాజీ సర్పంచ్ తుకారం, నాయకులు హైమద్, నిసార్, నారాయణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.




