21 April, 2026 | 4:42 AM

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సమగ్ర అభివృద్ధి

21-04-2026 12:32 AM

బుగ్గబావి గూడెం సర్పంచ్ లక్ష్మి

వేములపల్లి ఏప్రిల్ 20: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందుతాయని బుగ్గ బావి గూడెం సర్పంచ్ బుర్రి లక్ష్మి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ, మహిళా సంఘం భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామపంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలు మహిళా సంఘం భవనానికి 10 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ ఏ ఈ ఉన్నిసా, కార్యదర్శి సబిత, ఉప సర్పంచ్ రేఖ సురేష్, వార్డు మెంబర్లు vనాగజ్యోతి రవి, రూప చంద్రకళ సుధాకర్ కృష్ణమూర్తి, జాన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పుల్లారెడ్డి , కర్ణాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.