2 July, 2026 | 1:53 AM

ఇషాన్ కిషన్ @ 1

02-07-2026 01:16 AM
  1. టాప్ ప్లేస్‌లో యువ బ్యాటర్
  2. టెస్టుల్లో హెడ్‌కు టాప్ ప్లేస్
  3. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్

దుబాయి, జూలై 1 : భారత యువ బ్యా టర్ ఇషాన్ కిషన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. తాజాగా విడుదలైన జాబితాలో ఇషాన్ అగ్రస్థానాన్ని కైవసం చే సుకున్నాడు. గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఈ యువ బ్యాటర్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టా డు. అయితే వీరిద్దరి మధ్య 7 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఇషాన్ 876 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ ర్యాం కులో నిలిస్తే, అభిషేక్ శర్మ 869 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

నిజానికి ఇషాన్ కిషన్‌కు ఏడాది క్రితం జట్టులో చోటే లేదు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. కానీ తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టాడు. కెప్టెన్‌గా జార్ఖండ్‌కు సయ్యద్ ముస్తాక్ అలీ టైటిల్‌ను అందించాడు. ఐపీఎల్‌లోనూ రాణించి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వన్డే జట్టులో సైతం చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ టీ20 ప్రపంచకప్‌లో సైతం చెలరేగాడు. ఈ వరుస ప్రదర్శ నలతోనే ఇప్పుడు టీ20 క్రికెట్‌లో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లాడు.

ఇదిలా ఉంటే టాప్ 10లో మొత్తం నలుగురు భారత బ్యాటర్లే చోటు దక్కించుకున్నారు. తిలక్ వర్మ ఆరో స్థానంలోనూ, సూర్యకుమార్ ఎనిమిదో స్థానంలోనూ నిలిచారు. అటు బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి మూడో ర్యాంకులోనూ, బుమ్రా ఆరో ర్యాంకులోనూ కొనసాగుతున్నారు. మరోవైపు ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో నిలిచాడు.  హ్యారీ బ్రూక్, జో రూట్, స్మిత్ వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచారు. అయితే వీరందరి మధ్య పాయింట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది.