21 April, 2026 | 5:59 AM

ప్రభుత్వ బీసీ హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎంపీడీఓ సునిత

21-04-2026 12:33 AM

నూతనకల్, ఏప్రిల్ 20: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని ఎంపీడీఓ సునిత సోమవారం తనిఖీ చేశారు.ఈ తనిఖీలో భాగంగా హాస్టల్లోని రికార్డులను, విద్యార్థుల హాజరు పట్టికను ఆమె పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న భోజన సదుపాయాలు, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

వంటశాల, గదులను పరిశీలించిన ఎంపీడీఓ.. వసతి గృహంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.