బాలాపూర్‌లో అక్రమ వెంచర్
ప్రజావాణిలో ఫిర్యాదు
బడంగ్‌పేట్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్‌లో నిబంధనలకు విరుద్ధం గా వెలుస్తున్న అక్రమ వెంచ్ప ఎంఆర్పిఎస్ నాయకులు బొర్ర రవి మాదిగ సోమవారం ప్రజావాణిలో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.అనుమతులు లేని అక్రమ వెంచర్లు ఈ సందర్భంగా రవి మాదిగ మాట్లాడుతూ, బడంగ్పేట్ సర్కిల్ బాలాపూర్ శివాజీ చౌక్ - గణేష్ చౌక్ మధ్య గల ప్రధాన రహదారిలో, సర్వే నంబర్లు 9, 10, 11లలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ వెంచర్ వేస్తున్నా రని పేర్కొన్నారు.
నూతన మున్సిపల్ చట్టం ప్రకారం ఓఆర్‌ఆర్ లోపల కేవలం హెచ్‌ఎండిఏ అనుమతులతోనే వెంచర్లు వేయాలి. కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఫోర్జరీ పత్రాలను సృష్టించి విచ్చలవిడిగా వెంచర్లు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ అక్రమ వెంచర్లకు సర్కిల్ అధికారులతో పాటు, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారుల పూర్తి మద్దతు ఉందని ఆయన ఆరోపించారు.
అధికారుల ప్రోత్సాహంతోనే ఇలాంటి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని, గతంలో ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదని విమర్శించారు. అధికారులు మా మూళ్ల మత్తులో ఉండి ప్రజలను, ప్రభు త్వ ఖజానాను మోసం చేస్తున్నారు. ఇప్పటికే బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల వల్ల 10 మంది అధికారులు సస్పెండ్ అయ్యారు, అయినా మార్పు రావ డం లేదు. తక్షణమే జీహెచ్‌ఎంసీ స్పందించి వీరికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






