25 July, 2026 | 2:34 AM

రేడియల్ రోడ్-2 భూసేకరణ

25-07-2026 01:45 AM

రైతులకు ఎకరాకు రూ.40 లక్షల పరిహారం జమ

షాద్నగర్ జులై 24 (విజయక్రాంతి): షాద్నగర్ నియోజకవర్గంలో రేడియల్ రోడ్-2 నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.40 లక్షల పరిహారంతో పాటు హె చ్‌ఎండీఏ పరిధిలో ఒక ప్లాట్ కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో, అధికారులతో జరిగిన చర్చల అనంతరం రైతులకు ఇచ్చిన హామీ మేరకు పరిహారం నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. తొలిదశలో తుమ్మలపల్లి, చు క్కమెట్టు రెవెన్యూ గ్రామాల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయగా, మిగతా గ్రామాల రైతుల కు కూడా త్వరలోనే పరిహారం చెల్లిస్తామని అధికారులు వెల్లడించారు. సమయానుకూలంగా న్యాయం చేసిన ప్రభుత్వం, ఎమ్మెల్యే, అధికారులకు భూ నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు.