అక్రమణాల తొలగింపు
ట్రాఫిక్ కానిస్టేబుల్ అనిల్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రయాణికులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి.అనిల్ ఉత్తర్వుల మేరకు సుల్తానాబాద్ తెలంగాణ చౌరస్తా పాయింట్ వద్ద ఉన్నటువంటి అక్రమ గద్దెను సోమవారం ట్రాఫిక్ కానిస్టేబుల్ సిరికొండ అనిల్ తొలగించారు. విద్యుత్ శాఖకు చెందిన గద్దెతోపాటు చెత్తాచెదారాన్ని తీయించి, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేశారు. ట్రాఫిక్ పోలీస్ తరుపున సామాన్య ప్రజల సురక్షిత ప్రయాణం గురించి, మహిళలకు అక్కడే వాష్‌రూమ్‌లు ఉన్నప్పటికీ కనిపించే విదంగా లేకపోవడంతో చాలామంది గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సమయంలో కంప్రెసర్ బ్రేకర్ దొరకగా ఒడిసిపట్టి ఈ కార్యం నా ద్వారా పూర్తి చేయడం జరిగిందని, దీనికీ సైదులు కంప్రెసర్ బ్రేకర్, సాయి జెసిబి యజమానులకు ట్రాఫిక్ పోలీస్ తరుపునా సిరికొండ అనిల్ ధన్యవాదాలు తెలిపారు. అక్రమణాలను తొలగించి ప్రజలకు ఉపయోగకరంగా చేయడంతో పలువురు ప్రయాణికులు అనిల్ కు కృతజ్ఞతలు తెలిపారు.






