20 April, 2026 | 9:15 PM

మల్లాపూర్ తహసీల్దార్‌గా రామచందర్

20-04-2026 07:46 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల నూతన తహసీల్దార్‌గా కె. రామచందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ములుగు జిల్లా నుంచి డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి పొందిన ఆయనను మల్లాపూర్ తహసీల్దార్‌గా నియమించారు. ఈ సందర్భంగా కె. రామచందర్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పారదర్శకంగా రెవెన్యూ సేవలు అందిస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయనకు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, రెవెన్యూ శాఖ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసి అభినందనలు తెలిపారు.