ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కాయకల్ప నిపుణుల బృందం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ బృందం పరిశీలించింది. ఈ బృందం సభ్యులు ఆస్పత్రిలోనీ అన్ని విభాగాలను తనిఖీ చేశారు. వైద్య సేవలు, పరిసరాల శుభ్రత, వైద్య నాణ్యత సేవల ప్రమాణాలు తీరును ప్రత్యేకంగా పరిశీలించారు. రికార్డ్స్ మెయింటెనెన్స్ చూశారు. ప్రధానంగా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల తీరును సూపర్డెంట్ జి.రవిని ఈ బృందం వాకబు చేసింది. ఆస్పత్రిలో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, అందిస్తున్న సేవలు, వసతులు, సమస్యలను కాయకల్ప నిపుణుల బృందానికి ఆస్పత్రి సూపర్డెంట్ జి రవి వివరించారు. ఆసుపత్రిని సందర్శించిన కాయకల్ప నిపుణుల బృందంలో డాక్టర్ చంద్ర కృష్ణ (ఎన్వోఎఎస్), అభిషేక్ జిత్, (ఏఎస్సీఐ), ఉన్నారు. నర్సింగ్ ఆఫీసర్ ధరమ్ సింగ్, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.






