31 July, 2026 | 1:53 AM

రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి స్మృతిగ్రంథం

31-07-2026 12:05 AM
  1. పుస్తకం రచించిన పరేశ్‌కుమార్ శర్మ  
  2. ఆవిష్కరించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా

హైదరాబాద్, జూలై 30(విజయక్రాంతి): రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం లోక్‌భవన్‌లో మాజీ ప్రధాన అటవీ సంరక్షణాధికారి, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ పరేశ్‌కు మార్ శర్మ, ఐఎఫ్‌ఎస్ రచించిన ‘ఫుట్‌ప్రిం ట్స్ ఇన్ ది ఫారెస్ట్స్ మెమోరీస్ ఆఫ్ ఏ ఫారెస్టర్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో ఎస్‌ఆర్‌ఏఎస్ పబ్లిష్‌కు చెందిన సు ప్రియ భాలే రావు, ప్రముఖ అటవీ అధికారి డాక్టర్ మనోరంజన్ భాంజా,ఐఎఫ్‌ఎస్(రిటైర్డ్), సైకాలజీ కౌన్సిలర్ నేహా వ్యాస్ పా ల్గొన్నారు.

మూడు దశాబ్దాలకు పైగా అటవీ సేవలో పొందిన అనుభవాల ఆధారంగా ఈ పుస్తకాన్ని రచించినట్లు శర్మ తెలిపారు. ప్రస్తుతం సేవలో ఉన్న అధికారులు, కొత్తగా చేరేవారు, ఇతర సివిల్ సర్వెంట్లు, ప్రకృతి ప్రేమికులు, సివిల్ సర్వీస్‌లకు సిద్ధమవుతున్న విద్యార్థులక ఇది ఉపయోగపడుతుం దన్నారు. జాతీయ అటవీ విధానం, వాతావరణ మార్పుపై భారతదేశం చేసిన అంతర్జా తీయ కట్టుబాట్లకు అనుగుణంగా అడవులు, ప్రకృతి సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని గవర్నర్‌ను కోరారు. భవిష్యత్ తరాలకు గాలి, స్వచ్ఛమైన నీరు అందాలంటే అడవుల సంరక్షణ అవసరమని పేర్కొన్నా రు. కాగా ఈ పుస్తకం అమెజాన్‌లో తన విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకాలలో ఒకటిగా నిలిచింది.