ఎస్టీ, బీసీలకు కాలేజీలు, హాస్టళ్లు మంజూరు చేయాలి:ఎంపీ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, మే 6 (విజయక్రాంతి): బీసీలకు120 కాలేజీ హాస్టళ్ళు, 100 గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని, ఎస్టీలకు 50 కాలేజీ హాస్టళ్ళు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సంక్షేమ శాఖా ప్రిన్సిపల్ సెక్రటరీలు సవ్యసాచి ఘోష్, బాల మాయ దేవిలతో రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య బృందం నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి, రాజేందర్, అనంతయ్య, పగిళ్ళ సతీష్, మోడీ రాందేవ్, పృద్వి గౌడ్, అంజి గౌడ్, ప్రీతం, బలరాం లు చర్చలు జరిపారు.
హైదరాబాద్ లో తెలంగాణలోని ఉమ్మడి జిల్లా కేంద్రాలలో బిసి కాలేజి హాస్టళ్ళలో సీట్లు దొరకక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, చదువు మనుకుంటూన్నారని తెలిపారు. అలా గే పాఠశాల స్థాయిలో గురుకులాలకు చాలా డిమాండ్ ఉన్నందున సీట్లు సరిపోవడం లేదన్నారు. విద్యార్ధుల సంఖ్య లక్షలలో ఉంటే సీట్లు వేల సంఖ్యలలో ఉన్నాయన్నారు. రాష్ట్రం లో ఎస్టీలకు సరిపోవు కాలేజీ హాస్టళ్ళు లేవని హైదరాబాద్, నల్గొండ, వరంగల్‌తో సహా డిమాండ్లు 50 కొత్త కాలేజీ హాస్టళ్ళు మంజూ రు చేయాలని కోరినట్లు తెలిపారు. డిమాండ్ల మంజూరు కోసం ప్రతి పాదనను ప్రభుత్వానికి పంపుతామని ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చినట్లు ఎంపీ ఆర్. కృష్ణయ్య తెలిపారు.






