15 June, 2026 | 5:17 PM

బ్లాక్ బెర్రీ ఐలాండ్‌ను సందర్శించిన కలెక్టర్

10-06-2026 01:23 AM

మహబూబాబాద్, విజయక్రాంతి: ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరునాగారం జాతీయ రహదారిలో ఉన్న బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను మంగళవారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బ్లాక్ బెర్రీ ఐలాండ్ పరిసర ప్రాంతాలను, వాచ్ టవర్ ను పర్యాటకులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడి సుందర దృశ్యాలను తిలకించారు. పర్యాటక అభివృద్ధికి మరింత కృషి చేయనున్నట్లు తెలిపారు.