శ్రీ చక్రేశ్వర శివాలయంలో కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయాల వేలం
10-06-2026 01:20 AM
బోధన్, జూన్9 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో దేవస్థానానికి సంబంధించిన కొబ్బరి కాయలు, పూజా సామగ్రి విక్రయాల హక్కులను ఒక సంవత్సరం కాలపరిమితితో కిరాయి ఒప్పందం ద్వారా కేటాయించేందుకు జూన్ 12, 2026న ఉదయం 11 గంటలకు ఆలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణ అధికారి రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వేలంలో పాల్గొనదలచిన వారు 5,000 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యాపారులు, భక్తులు నిర్ణీత సమయానికి మందిర కార్యాలయంలో నిర్వహించే వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ వేలం ప్రక్రియను సంబంధిత అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.






