15 June, 2026 | 6:29 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

చేతుకు అందేలా విద్యుత్ తీగలు

10-06-2026 01:23 AM

ప్రమాదకరంగా ఉన్నా.. పట్టించుకోని అధికారులు..

తాడ్వాయి, జూన్, 9 (విజయక్రాంతి): ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించాల్సిన ట్రాన్స్కో అధికారులు తమ సేవలోనే మునిగిపోతున్నారు. ప్రమాదం జరుగుతుందని తెలిసిన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చూస్తాం అన్న తీరుగా ట్రాన్స్కో అధికారుల తీరు కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ శివారులో సర్వేనెంబర్ 148 లో ఎస్ ఎస్ 2 విధ్యుత్ తీగలు చేతికి అందుకునేలా ఉన్నాయి. విద్యుత్ తీగలు కిందికి వేలాడి ఉన్న సంబంధిత ట్రాన్స్కో అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

ఈ విషయమై రైతులు అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగిన తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఏదైనా జరగరానిది జరిగితే తప్ప అధికారులు స్పందించరా అంటూ రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లను పైకి లాగి బిగించాలని రైతులు కోరుతున్నారు. 

అధికారులు స్పందించకుంటే ఆందోళన చేస్తాం..

ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. సబ్‌స్టేషన్ ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ వైర్ల నుపైకి లాగి బిగించాలని కోరుతున్నారు.