10 May, 2026 | 12:37 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

20-02-2026 07:33 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

కొల్చారం,(విజయ క్రాంతి): కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకుని, సబ్జెక్టులను ఎలా అభ్యసించాలి. మంచి మార్కులు ఎలా సాధించాలనే విషయాలపై మార్గనిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు బట్టీ విధానానికి స్వస్తి పలికి, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తూచా తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని, టీవీ, మొబైల్ ఫోన్, సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఉమా రాణి, గ్రామ సర్పంచ్ దయాకర్ గౌడ్,  ఎంఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.