10 May, 2026 | 1:41 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

క్రీడల్లోను రాణించాలి

20-02-2026 07:37 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్.(విజయక్రాంతి): హైదరాబాద్‌లో ఈ నెల 17న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇండోర్, అవుట్‌డోర్ ఆటల పోటీల్లో రాణించిన జిల్లా విద్యార్థుల ప్రతిభ అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో, పోటీల్లో పాల్గొని జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించిన సందర్భంగా విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్ షీల్డ్‌లు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు జిల్లాకు మంచి పేరు తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా జిల్లా పేరును అగ్రస్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల స్పోర్ట్స్ ఇన్‌చార్జి శాంతి కుమార్, ఐఈఆర్పీలు సతీష్, సుజాత, రమణ, ప్రత్యేక విద్యావేత్త మహేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.