calender_icon.png 20 February, 2026 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యం

20-02-2026 07:28:36 PM

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో సబ్బండ వర్ణాల కోసం సామాజిక తెలంగాణ లక్ష్యంగా అధినేత్రి కవిత ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నారని తెలంగాణ జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్ సింగ్ అన్నారు. శుక్రవారం  సుల్తానాబాద్ మండల కేంద్రంలో పెద్దపల్లి జిల్లా జాగృతి అధ్యక్షులు కోదాటి శ్రీనివాస రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూపు సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం విస్మరించి ప్రచార అర్బటాలలో మునిగి తేలుతున్నారు.

తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల పక్షాన రాజలేని పోరాటం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి బలపరిచిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను ప్రజలు గెలిపించడం శుభ పరిణమమన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో జాగృతి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పెద్దపెల్లి జిల్లాలో జాగృతి అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

జిల్లాలోని 13 మండలాల్లో రిజర్వేషన్లకు అనుకూలంగా  అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని స్థానిక నాయకుల కు సూచించారు. అనంతరం సుల్తానాబాద్ కు చెందిన యువ న్యాయవాదులు కరుణాకర్,ప్రశాంత్ లు జాగృతి పార్టీలో చేరగా వారికీ జాగృతి కండువా కప్పి రూపు సింగ్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో  కేంద్ర కార్యాలయం కార్యదర్శి పోన్నమనేని బాలాజీ రావు, నాయకులు బొంగాని శంకరయ్య,సలేంద్ర కొమరయ్య,ఆవుల రాజేష్ యాదవ్, నిట్టూరి కవిత, రాజు తదితరులు పాల్గొన్నారు.