14 July, 2026 | 4:31 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

09-05-2026 12:36 AM
  1. త్వరగా గృహ ప్రవేశాలు నిర్వహించాలి
  2. కలెక్టర్ ఆశీష్ సంగువాన్ 

కామారెడ్డి, మే 8 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగువా న్ శుక్రవారం పరిశీలించారు. కామారెడ్డి మండలం లింగాపూర్ లో ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ పురోగతిని, పనుల నాణ్యతను క్షేత్రస్థాయిలో కలెక్టర్ తనిఖీ చేశారు.  లబ్ధిదారులకు త్వరితగతిన గృహ ప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని, సూచించారు. లబ్ధిదారులకు మౌలిక సదుపాయాలు కల్పించేలా సమన్వయంతో పనిచేయాలని అన్నారు.  ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అలాగే నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశించిన గడువులోగా ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.