14 July, 2026 | 4:47 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని

14-07-2026 04:28 PM

- బీఎల్‌ఓలకు పలు సూచనలు చేసిన మేయర్

ముకరంపుర,(విజయ క్రాంతి):  నగరంలోని రెండవ డివిజన్ తీగలగుట్టపల్లెలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ఓటరు సర్ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహణను పరిశీలించిన మేయర్,బూత్ స్థాయి అధికారులు ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని, అనర్హుల పేర్ల తొలగింపు, మార్పులు, చేర్పుల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఓటరు నమోదు, మార్పులు, చిరునామా సవరణ తదితర అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలని, ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని బీఎల్‌ఓలను కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల శాఖ అధికారులు, బీఎల్‌ఓలు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.