9 May, 2026 | 1:58 AM

దోమకొండలో పశువైద్య శిబిరం

09-05-2026 12:38 AM

దోమకొండ, మే 8, (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పశుసంవర్ధక శాఖ డాక్టర్ శివ ఆధ్వర్యంలో శుక్రవారం దోమకొండ గ్రామంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 48 పశువులకు వైద్య చికిత్సలు అందించగా, గర్భధారణ పరీక్షలు కూడా నిర్వహించారు. రైతులకు ఎస్‌ఎస్జీ రకం గడ్డి విత్తనాలు పంపిణీ చేసి కాల్ఫ్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం రైతు వేదికలో 25 మంది పాడి రైతులకు వేసవిలో పాడి పశువుల సంరక్షణ, సీజనల్ వ్యాధుల నివారణ టీకాలు, పశువుల షెడ్ నిర్వహణపై అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచ్ ఐరేణి నర్సయ్య, సింగిల్ విండో చైర్మన్ పి. నాగరాజు రెడ్డి, మాజీ జడ్పీటీసీ తిరుమల్ గౌడ్, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శైలీ ప్రెసిడెంట్ నరేష్, గ్రామ పాలకవర్గ సభ్యులు, పాడి రైతులు, పశువైద్య సిబ్బంది బాబు (పశుమిత్రుడు), లింగం (గోపాలమిత్ర), లక్ష్మికాంత్ తదితరులు పాల్గొన్నారు.