ఇంటర్ జిల్లా టాపర్లను సన్మానించిన కలెక్టర్
23-04-2026 12:06 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 22: ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో జిల్లా టాపర్లుగా నిలిచినా విద్యార్థుల ను బుదవారం డీఐఈఓ రాందాస్‌తో కలిసి కలెక్టర్ హరిత తన ఛాంబర్‌లో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మారుమూల మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాదించి జిల్లాకు గర్వ కారణంగా నిలచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






