ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
23-04-2026 12:08 AM
నిర్మల్, ఏప్రిల్ 2౨ (విజయక్రాంతి): మామడ మండలం జైరాం తండాలో రూ.24 లక్షలతో నిర్మించిన హనుమాన్ ఆలయ అభివృద్ధి పనులను బుధవారం బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ఆలయాల అభివృద్ధి పనులకు ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొండ్ర రాజారెడ్డి, సత్యం చంద్రకాంత్, మండల అధ్యక్షులు రంజిత్, నాయకులు బాపురెడ్డి, గ్రామ సర్పంచ్ జాదవ్ కైలాష్, మండల బీజేపీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.






