2 July, 2026 | 2:16 AM

ప్రీక్వార్ట ర్స్‌లో ఫ్రాన్స్

02-07-2026 01:08 AM

అదరగొట్టిన ఎంబాపె

న్యూయార్క్, జూలై 1 : సాకర్ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ప్రీక్వార్టర్ ఫైనల్‌కు దూసుకె ళ్లింది. కెప్టెన్ కిలియన్ ఎంబాపె అద్భుత ప్రదర్శనతో చెలరేగి ప్రపంచకప్ నాకౌట్ దశ కు చేర్చాడు. రౌండ్ ఆఫ్ 32లో ఫ్రాన్స్ 3 గోల్స్ తేడాతో  స్వీడన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎంబాపె రెండు గోల్స్ చేసి స్వీడన్ ఓటమిని శాసించాడు .ఈ మ్యా చ్ ద్వారా ఎంబాపె అంతర్జాతీయ ఫుట్‌బాల్ లో పలు సంచలన రికార్డులను తన ఖాతా లో వేసుకున్నాడు.

ప్రపంచకప్ నాకౌట్ దశలో అత్యధిక గోల్స్ (10 గోల్స్) చేసిన ఆటగాడిగా ఎంబాపె సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో బ్రెజిల్ దిగ్గజాలు లియోనిడాస్, రొనాల్డో (8 గోల్స్)లను వెనక్కి నెట్టాడు. ఎంబాపె ప్రపంచకప్ కెరీర్ మొత్తం గోల్స్ సంఖ్య 18కి చేరింది. ప్రస్తుతానికి గోల్డెన్ బూట్ రేసులో అతను మెస్సితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.