2 July, 2026 | 1:55 AM

టీజీ20 లీగ్ చట్టవిరుద్ధం : టీసీఏ

02-07-2026 01:10 AM
  1. హెచ్‌సీఏ అవినీతి ఒప్పందాలు బయటపెడతాం
  2. బీసీసీఐ అనుమతి చూపించరెందుకు ?
  3. టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్, జూలై 1 : హైదరాబాద్ క్రికె ట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ బీసీసీఐ నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువా రెడ్డి ఆరోపించారు. ఈ లీగ్ వెనుక ఉన్న అవినీతి ఒప్పందాలు, నిర్వాహకుల అక్రమ లీల లకు సంబంధించిన అన్ని ఆధారాలను త్వరలోనే ప్రజల ముందు బట్టబయలు చేస్తామ ని స్పష్టం చేశారు. హెచ్‌సీఏ పాలనలో పారదర్శకత పూర్తిగా లోపించిందని గురువారెడ్డి  మండిపడ్డారు.టీజీ20 టోర్నమెంట్ నిర్వహణకు బీసీసీఐ నుంచి అవసరమైన అనుమ తులు ఉన్నాయో లేదో హెచ్‌సీఏ ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలన్నారు. న్యాయపరమైన అంశాలపై వ్యక్తిగత వ్యాఖ్యలకు బదులుగా వాస్తవాలు, అధికారిక పత్రాలతో స మాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీసీసీఐ నియమావళిలో లేని అధికారిక హోదా లను ఉపయోగిస్తూ కొందరు వ్యక్తులు హెచ్‌సీఏ తరఫున దొంగ అకౌంట్లతో అక్రమంగా వ్యవహరిస్తున్నారనే అంశంపై సమగ్ర వివరణ ఇవ్వాలన్నారు. జిల్లా మరియు గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన క్రికెటర్లకు సమాన అవకాశాలు కల్పించకుండా ఎంపికలు జరిగాయని ఆరోపించారు. ఈ సందర్భం గా హైకోర్టు న్యాయవాదులపై కనీస పరిజ్ఞానం లేకుండా అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై అడ్వకేట్ రామ్ కళ్యాణ్ చల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.