11 April, 2026 | 9:55 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి   •   మునుగోడులో ఘనంగా రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   13 నుంచి అరైవ్ - అలైవ్... ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యo కావాలి   •   సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు పూలే   •   మద్యం శాఖకు ఉన్న మంత్రి విద్యాశాఖకు ఎందుకు లేడు?   •   చిన్న‌చెల్మెడలో సీసీ రోడ్డు ప‌నులు ప్రారంభం   •   తిప్పారం సర్పంచ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం   •   నో హెల్మెట్ నో పెట్రోల్, నో సీట్ బెల్ట్ నో ఫ్యూయల్   •   సిద్దిపేటలో మత్తు పదార్థాల విముక్తి చికిత్స కేంద్రం ప్రారంభం   •   ఘనంగా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు   •  

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

11-04-2026 07:21 PM

నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.