24 March, 2026 | 2:53 PM

ఘట్ కేసర్ బస్ టర్మినల్‌లో చలివేంద్రం ఏర్పాటు

24-03-2026 12:00 AM

ఘట్ కేసర్, మార్చి 23 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలోని బస్ టర్మినల్ ప్రాంగణంలో జన చైతన్య సేవా సమితి ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఘట్ కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యా దగిరియాదవ్ సోమవారం చెంగిచర్ల బస్ డిపో మేనేజర్ సీజీసీఎల్ కల్పనతో కలిసి ప్రారంభించారు. పట్టణలోని బస్ టర్మినల్ ఆవరణలో గత 13 సంవత్సరాలుగా ప్రయాణికుల దాహార్తిని తీర్చుటకు చలివేంద్రము ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కుతాడి రవీందర్, నాయకులు బర్ల దేవేందర్ ముదిరాజ్, కంది ప్రేమకుమార్, దంతాల అనిల్ కుమార్, జెసిఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సార శ్రీనివాస్ గౌడ్, ఆర్గనైజర్ సెక్రటరీ శివరాత్రి సురేష్ , నాగభూషణం, గోరుకంటి రవీందర్, అహ్మద్ సంతోష్, కేఫా, అబ్బసాని ప్రవీణ్, మనుక కుమార్, అందెల సా యి, సుబ్బారావు, కంది సాయిరామ్, అక్బ ర్, తన్నీర్ హరీష్, వెంటకేష్, రామకృష్ణ, శి వ, జన చైతన్య సేవా సభ్యులు పాల్గొన్నారు.