ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఘట్ కేసర్, మార్చి 23 (విజయక్రాంతి) : ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు చాలా కాలం తర్వాత ఆత్మీయ సమ్మే ళనం ద్వారా కలుసుకున్నారు. ఘట్ కేసర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 197273 సంవత్సరంలో 10వతరగతి చదివిన విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి హాజరై అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. మొదట సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. గురువులను స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సత్కారాలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ సమ్మేళనం అందరికీ ఆనందభరితమైన మరి యు మరపురాని అనుభూతిని కలిగించింది. ఈకార్యక్రమం బత్తుల రామలింగంగౌడ్, మేకల దాస్, బి. మల్లారెడ్డి, ఎం. నరసింహ, మాణిక్యం, సుధాకర్, పి. యాదిరెడ్డి, సుదర్శన్, బాలకృష్ణ, కృష్ణ రెడ్డి తదితరుల నేతృ త్వంలో నిర్వహించబడగా, సుమారు 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు.




