ఊర్కొండపేటలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
04-07-2026 04:05 PM
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని ఊర్కొండపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పర్యటించారు. మిడ్జిల్, ఊర్కొండకు చెందిన కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రిని కలిసి ఘన స్వాగతం పలికినంతరం మహబూబ్ నగర్ జిల్లా నేతలు శాలువాతో సన్మానించారు. తన రాజకీయ అనుచరులను ఆత్మీయంగా పలకరించిన సీఎం ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామిని దర్శిచుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని దర్శించుకున్నావారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, పలువురు మంత్రులు ఉన్నారు. సీఎం, మంత్రులకు ఆలయ పూజరులు వేదాశ్వీరచనం, ప్రసాదాలు అందజేశారు. అలాగే రూ.10 కోట్ల విలువైన ఆంజనేయస్వామి ఆలయంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనుచరులు, నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.






