రోడ్డుపైకి వర్షపు నీరు
* మురికి కాలువల అక్రమలతోనే
ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఆర్ అండ్ బి రోడ్డుకు ఇరువైపులుగా నిర్మించిన మురికి కాలువలను అక్రమించుకొని మూసివేయడంతో వర్షపు నీరు ఆర్ అండ్ బి రోడ్ పైకి వచ్చి నీటి కుంటలను తలపించే విధంగా నీరు నిల్వ ఉంటుంది. ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులతో పాటు ఆర్ అండ్ బి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్రమించిన మురికి కాలువలను బయటకు తీసి వర్షపు నీరు మురికి కాలువల నుండి చిన్న వాగులోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డు పక్కన కాలినడకతో నడుచుకుంటూ వెళ్లే వారిపై రోడ్డుపై ఉన్న మురికి నీరు పడడంతో ఇబ్బందులు పడడంతో పాటు తిరిగి ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు.






