భద్రాచలంలో కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం
హైదరాబాద్: భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవం(Sri Sita Rama Kalyana Mahotsavam) కనులపండువగా జరుగుతుంది. భద్రాచలంలో శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క స్వామివారి కల్యాణం తిలకించారు. స్వామివారి కల్యాణోత్సవంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి
పరమ పవిత్రమైన శ్రీరామనవమి మహోత్సవం(Sri Rama Navami Grand Celebration) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ(People of Telangana) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మం, న్యాయం, నిజాయితీకి ప్రతీకగా నిలిచిన శ్రీరామచంద్ర ప్రభువు ప్రజలందరికీ ఆదర్శ పురుషుడని పేర్కొన్నారు. ఆ ధర్మస్వరూపుడు చూపిన మార్గంలో నడుస్తూ, మన జీవితాల్లో సత్యం, సహనం, కర్తవ్యబద్ధతను అలవర్చుకుని ఆదర్శ జీవితం గడపాలని కోరారు. శ్రీరామచంద్రుని కృపాకటాక్షాలతో ఈ పవిత్రమైన శ్రీరామనవమి మహోత్సవం(Sri Rama Navami) అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.




