ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
హైదరాబాద్: ఈ నెల 19 నుంచి 22 వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) ఆహ్వానించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానాన్ని అందించారు. ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మార్చి 19 నుంచి 22వ తేదీ వరకు నాలుగు రోజులపాటు “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 22న నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. దానికి సమీపంలో రూ. 80 కోట్లతో నిర్మించనున్న రిఫైనరీ యూనిట్‌కు సీఎం శంకుస్థాపన చేస్తారు.




